Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

నల్లగొండలో ఉత్సాహంగా “రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం

Author
Posted By DAINAMIC NEWS
| 31 Oct 2025, 08:00 AM | తాజా సమాచారం
నల్లగొండలో ఉత్సాహంగా “రన్ ఫర్ యూనిటీ సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం


నల్లగొండ బ్యూరో, డైనమిక్



నల్లగొండ పట్టణంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ 2కె రన్‌కు జెండా ఊపి ప్రారంభించారు.యన్.జి. కళాశాల నుంచి క్లాక్ టవర్ వరకు సాగిన ఈ రన్‌లో పోలీస్ అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, స్థానిక యువత, ప్రజలు కలిపి సుమారు 500 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశ సమైక్యత, ఐక్యతను ప్రతిబింబించేలా నినాదాలు చేస్తూ రన్ కొనసాగించారు.కార్యక్రమం అనంతరం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పుష్పమాల అర్పించి ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ,
“సర్దార్ వల్లభభాయ్ పటేల్ భారత స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు 550కి పైగా సంస్థానాలను భారత దేశంలో విలీనం చేసి దేశ సమగ్రతకు అజరామరమైన సేవ చేశారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని మనందరం దేశ ఐక్యత కోసం కృషి చేయాలి” అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, సిబ్బంది, విద్యార్థులు జాతీయ ఐక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాజశేఖర్ రెడ్డి, మహాలక్ష్మయ్య, జితేందర్ రెడ్డి, శ్రీను నాయక్, రఘువీర్ రెడ్డి, ఆర్‌ఐలు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, హరిబాబు, ఎస్సైలు సైదులు, గోపాల్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి