Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డున పడ్డ రైతు.. పెట్టుబడి రెక్కల కష్టమంతా వరద పాలు!అకాల వర్షానికి తడిసిన వడ్లు, మొక్కజొన్న — చేతికొచ్చిన పంట నీటిపాలు

Author
Posted By DAINAMIC NEWS
| 02 Nov 2025, 11:57 PM | తాజా సమాచారం
రోడ్డున పడ్డ రైతు.. పెట్టుబడి రెక్కల కష్టమంతా వరద పాలు!అకాల వర్షానికి తడిసిన వడ్లు, మొక్కజొన్న — చేతికొచ్చిన పంట నీటిపాలు


మెదక్ జిల్లా,డైనమిక్, నవబంబర్ 3



అకాల వర్షం మెదక్ జిల్లా రైతులకు పెద్ద దెబ్బ తగిలించింది. ఆదివారం మధ్యాహ్నం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో ఇప్పటికే కోతకు సిద్ధంగా ఉన్న పంటలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. కళ్లాలలో, రోడ్లపై ఆరబెట్టిన వడ్లు, మొక్కజొన్న తడిసి రైతుల కష్టానికి నీరాజనం పట్టాయి.



ఆరబెట్టిన పంటలకు తీవ్ర నష్టం



మార్కెట్‌కు తరలించడానికి సిద్ధంగా ఉంచిన ధాన్యం, మొక్కజొన్న రాశులను రైతులు రోడ్లపైనే ఆరబెట్టారు. ఆకస్మికంగా వర్షం కురవడంతో వాటిని కప్పుకునే వీలు లేకుండా పోయింది. వడ్ల కుప్పలు నీటిలో తడిసి ముద్దయ్యాయి. తేమ పెరగడంతో మొలకెత్తే ప్రమాదం నెలకొంది. కొన్నిచోట్ల వడ్ల రాశులు నీటితో కొట్టుకుపోయాయి.



మొక్కజొన్న గింజలు కూడా పాడైపోయాయి


ఇవి కూడా చదవండి


ఇప్పటికే కోసి ఆరబెట్టిన మొక్కజొన్న గింజలు వర్షం తాకిడితో తడిసి బూజుపట్టే పరిస్థితి ఏర్పడింది. గింజలు దెబ్బతిని నాణ్యత కోల్పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



కోత దశలో ఉన్న పంటలు నేలపాలు



ఈదురుగాలులు, వర్షం కారణంగా పొలాల్లోని వరి పంట నేలకొరిగింది. నీటిలో కంకులు నానిపోవడంతో మొలకెత్తే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. పత్తి పొలాల్లో కూడా భారీ నష్టం చోటుచేసుకుంది. తడిసిన దూది రంగు మారి నాణ్యత తగ్గిపోయింది.



‘రెక్కల కష్టం మట్టిపాలైంది’ అని రైతుల వాపో



కొన్ని రోజులుగా కురుస్తున్న ఉధృత వర్షాలు రైతుల గుండెల్లో వేదన మిగిల్చాయి. వర్షాల వలన వరి, పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న పంటలు నీటిపాలవడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు.“సీజన్ మొత్తం కష్టపడి పండించిన పంట ఒక్క వర్షంలో నాశనం అయింది. అప్పులు తీర్చే దారిలేకుండా పోయింది” అని రైతులు వాపోతున్నారు. తమ కష్టం మట్టిపాలైపోయిందని, ఈ నష్టం నుంచి ఎప్పుడు బయటపడతామో తెలియదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.