Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ప్రవర్తన మార్చుకుని మంచి పౌరులుగా మారాలి : సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు

Author
Posted By DAINAMIC NEWS
| 29 Nov 2025, 10:01 AM | ఆంధ్ర ప్రదేశ్
రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ప్రవర్తన మార్చుకుని మంచి పౌరులుగా మారాలి : సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు


డైనమిక్ న్యూస్, నరసరావుపేట, నవంబర్29



నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెండవ పట్టణ సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.



చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు



ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, దౌర్జన్యాలు, రౌడీయిజానికి పాల్పడినట్లు సమాచారం అందితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి


నిరంతర నిఘా కొనసాగుతుంది



రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎల్లవేళలా నిఘా ఉంచుతారని తెలిపారు. ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు.



అధికారులు, సిబ్బంది హాజరు



ఈ కౌన్సిలింగ్ కార్యక్రమంలో ఎస్సైలు లేఖ ప్రియాంక, సౌందర్ రాజన్‌తో పాటు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.