Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

అణగారిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగారంగాకు ఘన నివాళులర్పించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్.

Author
Posted By DAINAMIC NEWS
| 26 Dec 2025, 09:36 AM | ఆంధ్ర ప్రదేశ్
అణగారిన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి రంగారంగాకు ఘన నివాళులర్పించిన గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్.


డైనమిక్ న్యూస్,గుంటూరు, డిసెంబర్ 26



రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించిన వంగవీటి రంగా ప్రజాదరణ పొందిన నేత అని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే, అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ పేర్కొన్నారు.



వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే



వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా శుక్రవారం గుంటూరు నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ పాల్గొన్నారు. తొలుత గుంటూరు తూర్పు శాసనసభ్యుల కార్యాలయంలో రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.విగ్రహాలకు పూలమాలలు, అన్నదాన కార్యక్రమంఅనంతరం నెహ్రూనగర్, శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. యాదవబజారులో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి హాజరై స్వయంగా వడ్డించి సేవా భావాన్ని చాటారు.



నిరుపేదల కోసం జీవితాంతం పోరాడిన నేత



ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాట్లాడుతూ, నిరుపేదలు, అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహానేత వంగవీటి రంగా అని కొనియాడారు. రాజకీయ, సేవా రంగాల్లో ఎన్జీ రంగా సేవలు నిరుపమానమని తెలిపారు.


ఇవి కూడా చదవండి


లక్షలాది మంది ఆశల వారధి



వంగవీటి రంగా అంటే కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, లక్షలాది మంది అణగారిన వర్గాల ఆశల వారధిగా నిలిచారని అన్నారు. కులమతాలకు అతీతంగా, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలిచిన నాయకుడని గుర్తు చేశారు.



యువ నాయకులకు స్ఫూర్తిదాయకం



కార్పొరేటర్‌గా, ఎమ్మెల్యేగా ఎదిగిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. రంగా చూపిన తెగువ, పోరాట పటిమ నేటి యువ నాయకులకు మార్గదర్శకమని తెలిపారు.



ప్రముఖులు పాల్గొన్నారు



ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ డేగల ప్రభాకర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రాజా మాస్టార్, జనసేన కార్పొరేటర్ ఆనంద్ సాగర్, ఉమా శంకర్, శనక్కాయల రాజకుమారి, ఎరగోపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.