Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ప్రజల దారిని మింగేసిన అక్రమాలుస్పందించని అధికారులు

Author
Posted By DAINAMIC NEWS
| 08 Mar 2026, 04:37 AM | తాజా సమాచారం
ప్రజల దారిని మింగేసిన అక్రమాలుస్పందించని అధికారులు


డైనమిక్ న్యూస్, మోతే, మార్చి 8



ఎస్సారెస్పీ కెనాల్‌పై పెరుగుతున్న అక్రమాలు



మోతె మండలం రాఘవపురం ఎక్స్ రోడ్డు వద్ద ఉన్న ఎస్సారెస్పీ కెనాల్‌పై రోజురోజుకు అక్రమాలు పెరుగుతున్నాయి. ప్రజలు రాకపోకలు సాగించే మార్గాన్ని కూడా కొందరు ఆక్రమించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



నడవడానికి కూడా దారి లేక ప్రజల ఆవేదన



కెనాల్ పక్కన ఉండే మార్గాన్ని మట్టి పోయడం, చెత్త చెదారం వేయడం, చిన్నచిన్న నిర్మాణాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలతో ఆక్రమించడంతో ప్రజలకు నడవడానికి కూడా సరైన దారి లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోతున్నారు. దీంతో రాకపోకలు కష్టంగా మారాయని తెలిపారు.

ఇవి కూడా చదవండి



నీటి ప్రవాహానికి అడ్డంకులు



కెనాల్‌లో జరుగుతున్న అక్రమాల వల్ల నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ ఆకృతి కూడా మారిపోతుందని, భవిష్యత్తులో సాగునీటి సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.



వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్



అక్రమాలను వెంటనే తొలగించి కెనాల్‌ను శుభ్రపరచాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. సమస్యపై స్పందించి తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్దఎత్తున నిరసనలు చేపడతామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు.