Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Author
Posted By DAINAMIC NEWS
| 04 May 2026, 07:07 AM | తాజా సమాచారం
పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి


సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్, మే 4



పిపిసి కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు మరింత వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హమాలి, రవాణా ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.



హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్



హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ హాజరయ్యారు.



రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్ల స్థితి



రాష్ట్రవ్యాప్తంగా పిపిసి కేంద్రాలకు 21.34 లక్షల మెట్రిక్ టన్నుల వరి చేరగా, ఇప్పటివరకు 13.32 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేసినట్లు మంత్రులు తెలిపారు. తడిసిన వరిని వెంటనే కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు.



రైతులకు సదుపాయాలు – వాతావరణ హెచ్చరికలు



పిపిసి కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, నీడ సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో రైతులకు నిరంతర హెచ్చరికలు అందించాలని, టార్పెలిన్లు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. మెరుపులు, వానల సమయంలో రైతులు కరెంట్ స్తంభాలు, పెద్ద చెట్లకు దూరంగా ఉండాలని సూచించారు.


ఇవి కూడా చదవండి


జిల్లాలో కొనుగోళ్లు – కలెక్టర్ వివరాలు



జిల్లాలో ఇప్పటివరకు 1.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, అందులో 1.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. కొనుగోలు పూర్తైన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు.



రైతుల ఖాతాల్లో రూ.100 కోట్లు జమ



ఇప్పటివరకు రూ.100 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు వెల్లడించారు. ఇటీవల రెండు రోజుల క్రితం రూ.40 కోట్లు, ఒక్కరోజులోనే రూ.44 కోట్లు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు.



అకాల వర్షాలపై చర్యలు



అకాల వర్షాలతో నష్ట నివారణ చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు. నూతన్‌కల్ మండలంలో వర్షాల వల్ల 250 బస్తాల ధాన్యం తడిసినట్లు పేర్కొన్నారు.



రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యం



ధాన్యం సేకరణను రోజుకు 10 వేల మెట్రిక్ టన్నుల లక్ష్యంగా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించేందుకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో లారీలను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. గన్ని బ్యాగులు కూడా సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.