Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి కమలానగర్ శివారులో విషాద ఘటన

Author
Posted By DAINAMIC NEWS
| 18 May 2026, 10:40 PM | తాజా సమాచారం
వ్యవసాయ బావిలో పడి మహిళ మృతి కమలానగర్ శివారులో విషాద ఘటన


నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, మే 19



నేరేడుచర్ల మండలం కమలానగర్ గ్రామ శివారులో విషాద ఘటన చోటుచేసుకుంది. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన నక్క భాగ్యలక్ష్మి (27) వ్యవసాయ బావిలో పడి మృతి చెందింది.



గొర్రెలు మేపుతున్న సమయంలో ప్రమాదం



భాగ్యలక్ష్మి తన భర్త మొగిలయ్యతో కలిసి నెల రోజులుగా కమలానగర్ పరిసర ప్రాంతాల్లో గొర్రెలు మేపుతూ జీవనం సాగిస్తోంది. సోమవారం మధ్యాహ్నం గొర్రెలు మేపుతున్న సమయంలో పోరెడ్డి వెంకటనారాయణ రెడ్డి వ్యవసాయ బావి వద్ద నీటి కోసం వెళ్లిన ఆమె ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయింది.



సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పోలీసులు


ఇవి కూడా చదవండి


ఘటనను గమనించిన భర్త మొగిలయ్య వెంటనే నేరేడుచర్ల పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై పి. సైది రెడ్డి సహాయక చర్యలను ప్రారంభించారు. గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది సహాయంతో బావిలో గాలింపు చేపట్టారు.



నాలుగు మోటార్లతో నీరు తొలగించి మృతదేహం వెలికితీత



బావిలో నీటి మట్టం ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు ఆటంకం ఏర్పడింది. దీంతో ఎస్సై సైది రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు మోటార్ల సహాయంతో బావిలోని నీటిని బయటికి తొలగించి మంగళవారం మృతదేహాన్ని వెలికి తీశారు.



ఎస్సై సైది రెడ్డి పనితీరుకు ప్రశంసలు



క్లిష్ట పరిస్థితుల్లో స్వయంగా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేసిన ఎస్సై సైది రెడ్డి పనితీరుపై స్థానికులు ప్రశంసలు వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.