Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కోదాడ మెగా జాబ్ మేళాకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలి 19న కోదాడలో ఉద్యోగ మేళా

Author
Posted By DAINAMIC NEWS
| 16 Sep 2026, 04:51 AM | తాజా సమాచారం
కోదాడ మెగా జాబ్ మేళాకు యువత అధిక సంఖ్యలో హాజరుకావాలి 19న కోదాడలో ఉద్యోగ మేళా


నేరేడుచర్ల,శుభోదయ డైనమిక్ వార్త, సెప్టెంబర్ 16



ఈ నెల 19న శనివారం కోదాడ పట్టణంలోని సీసీ రెడ్డి కాన్వెంట్‌లో నిర్వహించే మెగా జాబ్ మేళాకు అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులు అధిక సంఖ్యలో హాజరై ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కోణతం చిన్న వెంకటరెడ్డి కోరారు.



300 కంపెనీలకు పైగా పాల్గొనే అవకాశం



రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 300 కంపెనీలు మేళాలో పాల్గొననున్నట్లు చెప్పారు. గత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో 200 కంపెనీలు పాల్గొని సుమారు 3 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించాయని గుర్తుచేశారు.

ఇవి కూడా చదవండి



యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యం



నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు, వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్, వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు కట్ట రామారావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి రాచకొండ అజయ్, మత్స్యశాఖ చైర్మన్ యామిని వీరయ్య, కౌన్సిలర్లు ఇంజమూరి శ్రీకాంత్, నన్నిపంగ శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సురేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగయ్య, కాంగ్రెస్ నాయకులు వెంకట సైదులు, మచ్చ శ్రీను, కర్ణం పాండయ్య, రామిరెడ్డి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.