Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

హాజరు తగ్గితే చర్యలు తప్పవు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 60 శాతంలోపు హాజరున్న పాఠశాలల హెచ్‌ఎంలకు నోటీసులు

Author
Posted By DAINAMIC NEWS
| 30 Sep 2026, 07:05 AM | తాజా సమాచారం
హాజరు తగ్గితే చర్యలు తప్పవు: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ 60 శాతంలోపు హాజరున్న పాఠశాలల హెచ్‌ఎంలకు నోటీసులు


ఎఫ్‌ఆర్‌ఎస్‌ నిబంధనలు పాటించకుంటే రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేత
ప్రాథమిక విద్యార్థులకు టాలెంట్‌ సెర్చ్‌ పరీక్షలు



సూర్యాపేట బ్యూరో , సెప్టెంబర్ 30, శుభోదయ డైనమిక్ వార్త



విధుల పట్ల అలసత్వం వహించే ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ స్పష్టం చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ సెప్టెంబర్ మాస సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎంఈవోలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు, ఎఫ్‌ఎల్‌ఎన్, ఎల్‌ఐపీ ప్రగతి, అధికారుల తనిఖీలు, స్పాట్ అసెస్‌మెంట్, పీఎం శ్రీ పనులు, మధ్యాహ్న భోజనం, భవిత కేంద్రాల పనితీరుపై సమీక్షించారు.



69 శాతమే విద్యార్థుల హాజరు



జిల్లాలో విద్యార్థుల సగటు హాజరు 69 శాతంగా ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతాన్ని మరింత పెంచాలని సూచించారు. 60 శాతం కంటే తక్కువ హాజరు నమోదైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు వెంటనే నోటీసులు జారీ చేసి, లిఖితపూర్వక వివరణ తీసుకోవాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి


ఎఫ్‌ఆర్‌ఎస్‌ హాజరుపై ప్రత్యేక దృష్టి



ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నెలలో 15 రోజుల కంటే తక్కువ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్‌) హాజరు ఉన్న ఉపాధ్యాయుల నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. వరుసగా మూడు నెలలు ఇదే విధంగా కొనసాగితే రెండు ఇంక్రిమెంట్లు నిలిపివేస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.









పరీక్షల ఫలితాలపై సమీక్ష



అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే సమ్మేటివ్ పరీక్షల ఫలితాలపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ఇకపై మండల స్థాయిలోనే కాకుండా ఉపాధ్యాయుల వారీగా కూడా విద్యా ప్రగతిని పరిశీలిస్తామని పేర్కొన్నారు.సమావేశంలో అదనపు కలెక్టర్ హరి సింగ్, ప్లానింగ్ కో-ఆర్డినేటర్ శ్రవణ్ కుమార్, క్వాలిటీ కో-ఆర్డినేటర్ హరికృష్ణ, ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.