Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం

కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం

ముఖ్యమైన పాయింట్స్:

  • కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం
  • ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకి
  • సౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు

కుషాయిగూడలో మైనర్ బాలుడు అదృశ్యం

కుషాయిగూడ, అక్టోబర్ 04 శుభోదయ డైనమిక్

కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న 16 ఏళ్ల బాలుడు అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది. సౌత్ కమలానగర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో చదువుతున్న కె. లోకేష్ అక్టోబర్ 3న అదృశ్యమైనట్లు అతని తండ్రి కలికివాయి మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. అక్టోబర్ 3న ఉదయం సుమారు 8.30 గంటలకు తండ్రి తన ద్విచక్ర వాహనంపై లోకేష్‌ను కళాశాల వద్ద దించి ఇంటికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల సమయంలో బాలుడు ఇంటికి రాకపోవడంతో కళాశాలకు వెళ్లి విచారించగా, అప్పటికే కళాశాల నుంచి వెళ్లిపోయినట్లు యాజమాన్యం తెలిపింది.దీంతో తండ్రి బాలుడి స్నేహితులు, పరిసర ప్రాంతాల్లో ఆరా తీసి గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుషాయిగూడ పోలీసులు కేసు నమోదు చేసి బాలుడి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.బాలుడి వివరాలు: కె. లోకేష్, వయస్సు 16 సంవత్సరాలు, ఎత్తు సుమారు 5.2 అడుగులు. సాధారణ ఛాయ. అదృశ్యమైన సమయంలో పసుపు రంగు కళాశాల యూనిఫాం టీ-షర్ట్, నీలం రంగు జీన్స్ ధరించి ఉన్నాడు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడగలడని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి