Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి  చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం

ముఖ్యమైన పాయింట్స్:

  • రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి
  • చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం

శుభోదయ డైనమిక్ న్యూస్ – నల్గొండ, అక్టోబర్ 12

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి  చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం - Additional Image

చిట్యాల పోలీస్ స్టేషన్‌ను యాదాద్రి జోన్ ఐజీ షాహనవాజ్ ఖాసిం ఐపీఎస్ సోమవారం సందర్శించి తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, పెండింగ్ కేసులు, శాంతిభద్రతల పరిరక్షణ, పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. మహిళలు, బాలల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు దొంగతనాల నియంత్రణ, రాత్రి పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించి, పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ఐజీ సూచనల మేరకు నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి, చిట్యాల సీఐ సురేష్, ఎస్‌ఐ వెంకట్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి  చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం - Additional Imageరోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి  చిట్యాల పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఐజీ షాహనవాజ్ ఖాసిం - Additional Image
అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ