Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

మార్కెట్ అభివృద్ధికి సమష్టి కృషి చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ వెల్లడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

మార్కెట్ అభివృద్ధికి సమష్టి కృషి  చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ వెల్లడి  మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

ముఖ్యమైన పాయింట్స్:

  • మార్కెట్ అభివృద్ధికి సమష్టి కృషి
  • చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ వెల్లడి
  • మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు

నేరేడుచర్ల, అక్టోబర్ 13 – శుభోదయ డైనమిక్ న్యూస్:

నేరేడుచర్ల మార్కెట్ అభివృద్ధికి అందరినీ కలుపుకొని సమష్టిగా కృషి చేస్తానని మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రంగినేని స్పందన రాజీవ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సందీప్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పందన రాజీవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన తమకు గుర్తింపు ఇచ్చి మార్కెట్ కమిటీ పదవులు కల్పించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. పదవుల కల్పనలో సహకరించిన మండల, పట్టణ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.మండల అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన స్పందన రాజీవ్‌కు అభినందనలు తెలిపారు. మార్కెట్ అభివృద్ధికి నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మునగాల భాస్కర్ రెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ నాయకులు చలసాని శ్రీనివాస్ రావు, పార్టీ కార్యకర్తలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ

నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి 17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ