Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై ఆగ్రహం 24 గంటల్లో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి

చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై ఆగ్రహం  24 గంటల్లో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి

ముఖ్యమైన పాయింట్స్:

  • చాకలి ఐలమ్మ విగ్రహం ధ్వంసంపై ఆగ్రహం
  • 24 గంటల్లో నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట బ్యూరో, శుభోదయ డైనమిక్ వార్త

మెదక్ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని రజక సంక్షేమ సంఘం రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు చిలకరాజు శ్రీను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అని ఆయన అన్నారు. మంగళవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, భూమి, భుక్తి కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేకపోతే ప్రజలకు భద్రత ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనపై ప్రభుత్వం, పోలీసు శాఖ తక్షణమే స్పందించి నిందితులను పట్టుకోవాలని కోరారు.విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లో గుర్తించి శిక్షించాలని, లేనిపక్షంలో రజక సంఘం తరఫున ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ