Loading Time...
న్యూస్ ఈ-పేపర్ Live TV
Mobile Logo
Loading...
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
ఈ రోజు మీ ప్రాంతం LIVE
మెనూ (MENU)

ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు

ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం  భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు

ముఖ్యమైన పాయింట్స్:

  • ఘనంగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిర శిఖర ప్రతిష్ఠ మహోత్సవం
  • భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, హోమాలు

నడిగూడెం, శుభోదయ డైనమిక్ వార్త | అక్టోబర్ 13:

నడిగూడెంలోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరంలో శిఖర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు మంగళవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో విశ్వేశ్వర పూజ, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, ప్రధాన కలశాధారణ, జలాధివాసం, ధాన్యాధివాసం, మూలమంత్ర హోమం తదితర పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ ఆధ్వర్యంలో అర్చక బృందం వేదమంత్రోచ్ఛారణల నడుమ పూజలు, హోమాలు నిర్వహించింది. పలువురు దంపతులు పూజా పీఠాలపై కూర్చొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మహోత్సవంతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయిబాబా ఆశీస్సులు పొందారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

ఇవి కూడా చదవండి

అత్యధికంగా చదివినవి
నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గం  చైర్‌పర్సన్‌గా రంగినేని స్పందన.. వైస్ చైర్మన్‌గా మునగాల భాస్కర్‌రెడ్డి  17 మందితో కమిటీ ఏర్పాటు.. రెండేళ్ల పాటు పదవీకాలం  జీఓ ఆర్టీ నంబర్ 687 ద్వారా ఉత్తర్వులు జారీ